TS News: రైతు చుట్టూ రాజకీయం.. రుణమాఫీపై అధికార, విపక్షాల పరస్పర విమర్శలు

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది.

Published : 20 Apr 2024 10:25 IST

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. రుణమాఫీ, పంటకు బోనస్, రైతుబంధుపై అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష భారాస (BRS) ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ (Congress) ఎదురుదాడి చేస్తూ ప్రచారం సాగిస్తోంది. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేయగా మాట తప్పారంటూ సీఎం ప్రకటనపై భారాస, భాజపా విమర్శల దాడి చేశాయి. తాజాగా డిప్యూటీ సీఎం సైతం రుణమాఫీపై కీలకవ్యాఖ్యలు చేశారు. పంటరుణాల మాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

మరిన్ని