Kamareddy: ఆలయంలో చోరీకి ఉద్యోగి యత్నం.. హుండీలో ఇరుక్కున్న చేయి!

ఆలయంలో చోరీ చేద్దామని భావించిన ఓ ఉద్యోగి ప్రయత్నం విఫలమైంది. చోరీ చేసేందుకు హుండీలో పెట్టిన అతడి చేయి.. అందులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నంచినా రాలేదు. పెద్దగా అరవలేక.. చాలాసేపు గింజుకున్నాడు. తెల్లవారే వరకూ హుండీలో చేయి పెట్టి అలాగే ఉండిపోయాడు. ఈలోపు భక్తులు వచ్చి అతడి చేయి బయటకు వచ్చేలా సాయం చేశారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి పోచమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది.

Updated : 03 Apr 2024 14:42 IST

Tags :

మరిన్ని