Thief Robbery: రన్నింగ్‌లో వాహనంపైకెక్కి లగేజీ చోరీ..!

జాతీయ రహదారుల్లో దోపిడీ దొంగలు అరికట్టేందుకు వివిధ ప్రాంతాలకు వాహనాలు నడిపే ట్రావెల్స్ యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు.

Published : 21 May 2024 15:57 IST

జాతీయ రహదారుల్లో దోపిడీ దొంగలు అరికట్టేందుకు వివిధ ప్రాంతాలకు వాహనాలు నడిపే ట్రావెల్స్ యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే  52వ నంబర్ జాతీయ రహదారిలో దొంగలు రన్నింగ్‌లోనే వాహనం ఎక్కి లగేజినీ దొంగిలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో అందులో వాస్తవమెంత అనే విషయాన్ని తెలుసుకొనేందుకు హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ట్రావెలర్స్ యజమాని వాహనం వెనక కెమెరాను ఏర్పాటు చేశారు. దీనితో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు వాహనం పైకి వెళ్లి లగేజిని రోడ్ పక్కన పడేసి మళ్ళీ చాక చక్యంగా దిగుతున్న దృశ్యాలు నమోదు అయ్యాయి.

Tags :

మరిన్ని