వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు నుంచి మా కుటుంబానికి ప్రాణహాని?: తెదేపా సానుభూతిపరులు

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని స్థానిక తెదేపా సానుభూతిపరుల కుటుంబసభ్యులు ఆరోపించారు. తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీపై జరిగిన దాడి కేసులో పోలీసులు తమవారిని అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు..

Published : 28 Nov 2023 17:20 IST
Tags :

మరిన్ని