Telangana news: వనపర్తి జిల్లాలో.. ప్రవాహంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు

మదనాపురం: సరళా సాగర్‌ సైఫన్లు, శంకర సముద్రం గేట్లు ఎత్తడంతో వనపర్తి జిల్లా మదనాపురం సమీపంలోని లోలెవల్‌ వంతెన వద్ద గత మూడు రోజులుగా నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేయలేకపోయిన ముగ్గురు వ్యక్తులు వంతెన మీదుగా బైక్‌పై వెళ్తూ జారిపడి గల్లంతయ్యారు. వీరు మదనాపురం నుంచి ఆత్మకూర్ వైపు వెళ్తున్నారు. గల్లంతైన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated : 25 Oct 2023 17:14 IST

Tags :

మరిన్ని