TSPSC: టీఎస్‌పీఎస్సీ కొత్త బోర్డు నియామకంపై ప్రభుత్వం కసరత్తు

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్‌ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్‌పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. 

Published : 11 Jan 2024 09:54 IST

Tags :

మరిన్ని