Mahabubabad: బావి తవ్వుతుండగా మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు

వ్యవసాయ బావి తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు మట్టిలో చిక్కుకున్న ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం గాంధీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. సుధాకర్ అనే రైతు  తను సాగు చేసే భూమిలో జేసీబీతో వ్యవసాయ బావిని తవ్విస్తుండగా అడుగున రాయి వచ్చింది. రాయిని పరిశీలించేందుకు సుధాకర్, కూలీ నరేశ్‌ బావి లోకి దిగారు. అదే సమయంలో మట్టి కూలడంతో వారు సగం వరకు కూరుకుపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జేసీబీ సహాయంతో 2 గంటల పాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు. 

Published : 03 Apr 2024 11:24 IST

Tags :

మరిన్ని