Economic Growth: చైనాకు తగ్గి.. భారత్‌కు భారీగా పెరిగిన విదేశీ పెట్టుబడులు: ఐరాస

భారత్‌ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. 

Published : 18 May 2024 13:57 IST

భారత్‌ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్‌ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. 2024 దేశ వృద్ధిరేటు అంచనాలను సవరించిన నేపథ్యంలో ఐరాస నిపుణుడు ఈవిధంగా మాట్లాడారు. ‘‘పాశ్చాత్య దేశాలతోపాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారత్‌ ఎంతో లబ్ధి చెందుతోంది. పశ్చిమదేశాల కంపెనీలకు వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఇది భారత్‌కు లబ్ధి చేకూరుస్తోంది’’ అని ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగానికి చెందిన హమీద్‌ రషీద్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని