Prakasam News: ఒంగోలులో 10 నెలల చిన్నారి కిడ్నాప్‌

ఒంగోలు సమీపంలోని కొప్పుల ఫ్లై ఓవర్ వద్ద 10 నెలల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. చిన్నారి నిరీక్షణ తల్లిదండ్రులు గత కొంత కాలంగా పొలాల్లో బాతులు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి స్కూటీపై వచ్చిన ఇద్దరు.. చిన్నారి తల్లిని నిద్రలేపి నీళ్లు కావాలని అడిగారు. నీళ్లు తీసుకొచ్చేలోపు నిద్రిస్తున్న కుమార్తెను ఎత్తుకెళ్లారని తల్లి బోరున విలపించారు. వెంట పరుగెత్తి పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated : 27 Nov 2023 14:13 IST
Tags :

మరిన్ని