Viral Video: 12 కిలోల ఫిర్యాదు పత్రాలతో అధికారుల ఎదుట రైతు నిరసన

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో న్యాయం కోసం ఓ రైతు ఆరేళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇన్నేళ్లుగా పోగుపడ్డ 12కిలోల ఫిర్యాదు దస్త్రాలను ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకెళ్లాడు. తన భూమిని గ్రామ పెద్దలు తహశీల్దార్‌తో కలిసి కుమ్మక్కై ఆక్రమించారని ఆరేళ్ల క్రితం చరణ్ సింగ్  ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు అతడిని పట్టించుకోలేదు. అప్పటి నుంచి భూ సమస్యను పరిష్కరించాలని 211 సార్లు అధికారులను వేడుకున్నాడు. ఎంతమంది అధికారులు మారినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. విసుగుతో 12 కిలోల దరఖాస్తు, ఫిర్యాదుల కాపీలను ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నాడు.

Published : 27 Nov 2022 11:28 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు