Uranium Mining: యురేనియం తవ్వుతున్నారు.. బాధితులను మరిచారు

యురేనియం.. దేశభవిష్యత్తు కోసం అవసరమే అయినా వాటి అనర్థాల నుంచి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలి. వారికి కావాల్సిన మౌలికవసతులు కల్పించాలి. కానీ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిలో పూర్తిగా విఫలం అయ్యాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో యురేనియం టెయిల్ పాండ్ ప్రభావంతో బాధిత గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితం కావడమే కాక.. పంటలు దెబ్బతినడం, తాగునీటి కష్టాలు ఏర్పడినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులకు సమీపంలోనే ఉన్న తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంతో 13 ఏళ్ల నుంచి బాధిత గ్రామాల ప్రజలు తీవ్రకష్టాలు పడుతున్నారు. బాధితులు మొరపెట్టుకున్న ప్రతిసారి యూసీఐఎల్‌ అధికారులతో పాలకవర్గం సమావేశమై చర్చించడం పరిపాటిగా మారిందే...తప్ప చర్యలు శూన్యం. తాజాగా ఈనెల 30న సీఎస్‌ జవహార్‌రెడ్డి అధ్యక్షతన యురేనియం బాధిత ప్రజలతో ఏర్పడిన కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కనీసం ఇప్పుడైనా బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

Published : 29 Nov 2023 23:27 IST

Tags :

మరిన్ని