Mudragada: పిఠాపురంలో పవన్‌ గెలిచారు.. నా పేరు మార్చుకుంటా!: ముద్రగడ

వైకాపా ఓటమితో ఆ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు.

Published : 05 Jun 2024 15:17 IST

వైకాపా ఓటమితో ఆ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి పంపుతామని ఎన్నికల ప్రచారంలో ముద్రగడ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని గతంలో ఆయన అన్నారు. పిఠాపురంలో పవన్‌ భారీ మెజార్టీతో గెలవడంతో తాను గతంలో చెప్పినట్టుగా తన పేరును మార్చుకుంటానని పద్మనాభం ప్రకటించారు. తన పేరు మార్చాలని గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు.

Tags :

మరిన్ని