AP News: ఏపీ మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 11 Jun 2024 09:41 IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్  చేసి చెప్పే అవకాశముంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది. పవన్‌తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు