Amrabad: రైతురుణాల పేరిట రూ.10 కోట్ల అక్రమాలు.. రంగంలోకి సీఐడీ

నాగర్‌కర్నూల్‌ జిల్లా పూర్వ అమ్రాబాద్‌ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన  రూ.10 కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది.

Published : 26 May 2024 11:06 IST

చేయని అప్పుకు ఆ రైతులు బాధ్యులయ్యారు. దరఖాస్తు చేసుకున్న పాపానికి రైతుల పేరుమీద అప్పు తీసుకుని స్వాహా చేశారు అక్రమార్కులు. బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బ్యాంకు అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట రూ.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పూర్వ అమ్రాబాద్‌ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన అక్రమాలపై ప్రస్తుతం సీఐడీ విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు నాలుగైదు ఏళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

Tags :

మరిన్ని