Pune Car Crash: పోలీసుల కౌంటర్‌ ఆపరేషన్‌.. పుణె కేసులో బుక్కైన డాక్టర్లు

పుణెలో జరిగిన పోర్ష్‌కారు ప్రమాదంలో మరో విషయం బయటపడింది. రూ.3 లక్షలకు కక్కుర్తిపడిన వైద్యులే రక్తం నమూనాలు మార్చేశారని పోలీసులు గుర్తించారు. కౌంటర్‌ ఆపరేషన్‌ నిర్వహించి వైద్యులను అరెస్టు చేశారు.

Published : 28 May 2024 17:57 IST

పుణె కారు ప్రమాదఘటనలో వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. మద్యం మత్తులో ఇద్దరి ప్రాణాలు తీసిన బాలుడిని.. డబ్బులు తీసుకొని కాపాడేందుకు చేసిన కుట్ర బట్టబయలైంది. ఇద్దరు డాక్టర్లు, వారికి సహకరించిన ప్యూన్‌ను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. డబ్బుకు కక్కుర్తిపడి నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు డాక్టర్లు వేసిన ఎత్తును కౌంటర్‌ ఆపరేషన్‌ ద్వారా చిత్తు చేసిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags :

మరిన్ని