Uttarakhand: హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లి నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18మంది ట్రెక్కర్లు అక్కడే చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి.

Published : 05 Jun 2024 16:05 IST

ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతాల్ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18మంది ట్రెక్కర్లు అక్కడే చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. హిమాలయాల్లో 4,400 మీటర్ల ఎత్తున సహస్త్రతాల్ సరస్సు ఉంది. మే 29న 22 మందితో కూడిన ట్రెక్కింగ్ బృందాన్ని హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ సరస్సు వద్దకు పంపింది. వారిలో 18మంది ట్రెక్కర్లు కర్ణాటకకు చెందిన వారు కాగా.. ఒకరు మహారాష్ట్రవాసి. ముగ్గురు స్థానిక గైడ్లు వారిని తీసుకుని వెళ్లారు. అయితే జూన్ 7న తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా వారు దారి తప్పారు. వారు బేస్ క్యాంప్‌ వద్దకు చేరుకోకపోవడంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమైంది. నలుగురు ట్రెక్కర్లు చనిపోయినట్లు గుర్తించింది. ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో హెలికాఫ్టర్ సాయంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వారిని కాపాడినట్లు ఉత్తరకాశి కలెక్టర్  తెలిపారు. 

Tags :

మరిన్ని