ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కూటమి శ్రేణులు పహారా ఉండాలి: నాగబాబు

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని కోరారు.

Updated : 18 May 2024 22:05 IST

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు కూటమి పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పార్టీల ప్రతినిధులు పహారా ఉండాలని కోరారు. ఓడిపోయాక కూడా జగన్ కుర్చీ వదిలేందుకు సిద్ధంగా ఉండబోరని అన్నారు. ఎన్నికల్లో దాదాపు 82 శాతం ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఇదే సమయంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని.. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైకాపా శ్రేణులు ఎంతటి అరాచకానికి ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో చూశామన్నారు. 

Tags :

మరిన్ని