Amaravati: విద్యుత్తు వెలుగుల్లో అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు

మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది.

Published : 11 Jun 2024 11:06 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 9 కి.మీ. మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులు కనువిందు చేశాయి. 

Tags :

మరిన్ని