Arogyasri: ‘ఆరోగ్యశ్రీ’ బటన్‌ నొక్కడంలో ఆలస్యమెందుకు?: డాక్టర్ బి.నరేందర్‌రెడ్డి

ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి బిల్లులు ప్రభుత్వం 6 నెలల నుంచి బకాయిలు పడటంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బి.నరేందర్‌రెడ్డి అన్నారు.

Updated : 21 May 2024 16:44 IST

ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి బిల్లులు ప్రభుత్వం 6 నెలల నుంచి బకాయిలు పడటంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.నరేందర్‌రెడ్డి అన్నారు. బిల్లుల చెల్లింపుపై పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగానే కొన్ని సంఘాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు. మందులు, వైద్య ఉపకరణాలు పంపిణీ చేసినవారి నుంచి ఆసుపత్రి యాజమాన్యాలపై ఒత్తిడి పెరుగుతోందని వాపోయారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల నిధులతో పోలిస్తే.. ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా తక్కువని.. కానీ, ఆరోగ్యశ్రీ బటన్ నొక్కడంలో ఆలస్యం ఎందుకని నరేందర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

Tags :

మరిన్ని