Raghurama: జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలని రఘురామ డిమాండ్‌..!

గతంలో సీఐడీ అధికారులు తనపై దాడి చేశారని దీని వెనుక మాజీ సీఎం జగన్ ఒత్తిడి ఉందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

Published : 11 Jun 2024 10:20 IST

గతంలో సీఐడీ అధికారులు తనపై దాడి చేశారని దీని వెనుక మాజీ సీఎం జగన్ ఒత్తిడి ఉందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ‘నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో 2021 మే నెలలో ఏపీ పోలీసులు నన్ను అరెస్టు చేసి కస్టడీలో హింసించారు. గుండె శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పినా మందులివ్వకుండా నిరాకరించారు. చంపేందుకు ప్రయత్నించారు. ఇందులో అప్పటి సీఎం జగన్‌తో పాటు ఐపీఎస్‌లు పీవీ సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, ఆర్‌.విజయపాల్, గుంటూరు జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, ఇతర అధికారుల పాత్ర ఉంది’ అని రఘురామ ఆరోపించారు.

Tags :

మరిన్ని