Kunamneni: పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదు: కూనంనేని

పదేళ్లుగా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 24 May 2024 18:10 IST

పదేళ్లుగా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లో సీపీఐ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు  విడుదల చేసిన మేనిఫెస్టో భాజపా ప్రభుత్వానిది కాదని, అది మోదీ మేనిఫెస్టో అనివిమర్శించారు. దేశానికి  పదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇస్తామని చెప్పిన పసుపు బోర్డును విస్మరించారని ఆయన మండిపడ్డారు.  

Tags :

మరిన్ని