కేసు పెడితే పెట్టుకోండి.. భూ వివాదంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఇతరులకు మధ్య భూవివాదం చోటు చేసుకుంది. తమ భూమిని కబ్జా చేసి అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులతో అక్కడకు వచ్చారు. ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది.

Updated : 18 May 2024 13:55 IST

కేసు పెడితే పెట్టుకోండి.. భూ వివాదంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదం

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఇతరులకు మధ్య భూవివాదం చోటు చేసుకుంది. తమ భూమిని కబ్జా చేసి అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులతో అక్కడకు వచ్చారు. ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వివాదంలోని భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మా భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.

Tags :

మరిన్ని