AP News: ఒకే క్యాంపస్‌లో రెండు యూనివర్సిటీలా..?

    సీఎం జగన్ తన తండ్రి పేరుతో సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Updated : 27 May 2024 12:39 IST

సీఎం జగన్ తన తండ్రి పేరుతో సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లు దాటినా వర్సిటీకి సొంత భవనం లేదు. అద్దె భవనాల్లోనే ఇన్నేళ్లు చదువులు సాగినా 6 నెలల నుంచి ఆ భవనాలకు బకాయిలు చెల్లించలేదు. దీంతో యోగి వేమన విశ్వవిద్యాలయం భవనాలను వినియోగించుకునేందుకు సీఎం సమీప బంధువు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఒకే క్యాంపస్‌లో రెండు విశ్వవిద్యాలయాలు నడపడం ఎలా సాధ్యం? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునేందుకే ఇలా చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని