AP Elections: ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడం కలకలం రేపింది.

Updated : 21 May 2024 22:12 IST

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202లోని ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగులకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన పోలింగ్ ఏజెంట్‌పై వైకాపా శ్రేణులు దాడి చేయడమే కాకుండా.. పిన్నెల్లి అతడిని హెచ్చరించారు. సిట్ విచారణలో ఈ సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసంనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు