CM Revanth Reddy: భాజపా గెలవడానికి భారాస ఓట్ల బదలాయింపే కారణం!: సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు భాజపా గెలవడానికి భారాస ఓట్ల బదలాయింపే కారణమని రేవంత్ ఆరోపించారు.

Published : 05 Jun 2024 17:09 IST

పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు భాజపాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు భాజపా గెలవడానికి భారాస ఓట్ల బదలాయింపే కారణమని రేవంత్ ఆరోపించారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ ఓట్లను పూర్తిగా భాజపాకు బదిలీ చేసి బలహీన వర్గాల కాంగ్రెస్ బిడ్డను ఓడించారని మండిపడ్డారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర చేసిన కేసీఆర్.. పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని