CM Revanth: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తా: సీఎం రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) స్పందించారు.

Published : 05 Jun 2024 15:57 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) స్పందించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని, సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు రేవంత్‌ గుర్తు చేశారు.

Tags :

మరిన్ని