Congress: ఓటర్లకు నాపై అభిమానం ఉన్నా.. అక్కరకు రాని పరిస్థితి: తీన్మార్‌ మల్లన్న

తనపై అభిమానంతో కొందరు నిబంధనల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఓటువేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు.

Published : 07 Jun 2024 13:18 IST

చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నందునే తొలి ప్రాధాన్యత లెక్కింపులో ఫలితం తేలలేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. తనపై అభిమానంతో కొందరు నిబంధనల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఓటువేశారని ఆయన చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే కొందరు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా అర్ధరాత్రి లోగా పూర్తిస్థాయి ఫలితం రావొచ్చని మల్లన్న చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు