PM Modi: కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు పాక్ సానుభూతిపరులు: మోదీ

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలు పాకిస్థాన్ సానుభూతిపరులని ప్రధాని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ పాకిస్థాన్  అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్‌పై కన్నేసిన ఆ దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ ఎద్దేవా చేశారు.

Published : 22 May 2024 18:49 IST

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలు పాకిస్థాన్ సానుభూతిపరులని ప్రధాని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ పాకిస్థాన్  అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్‌పై కన్నేసిన ఆ దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ పని అయిపోయినా.. దాని సానుభూతిపరులైన కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు మాత్రం ఆ దేశాన్ని చూసి భయపడటంలో నిమగ్నమై ఉన్నాయని మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని.. పాక్‌కు భయపడేందుకు ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని