Pawan Kalyan: ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా.. ఎందుకంటే!: పవన్ కల్యాణ్

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుతారీదనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకు ఉందన్నారు.

Updated : 05 Jun 2024 15:39 IST

పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను సంపూర్ణ జీతం తీసుకుంటానని చెప్పారు. తీసుకున్న ప్రతి రూపాయికీ జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. తాను తప్పు చేస్తే చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం ప్రజలకు ఉందన్నారు. జనసేన తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని