CPI Narayana: అల్లర్లపై సిట్ దర్యాప్తు కాలక్షేపానికి చేసినట్లుగా ఉంది: సీపీఐ నేత నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో అల్లర్లకు వైకాపానే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పథకం ప్రకారమే దాడి చేశారని పేర్కొన్నారు. అల్లర్లపై వేసిన సిట్ దర్యాప్తు కాలక్షేపానికి చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

Published : 21 May 2024 16:25 IST

ఆంధ్రప్రదేశ్‌లో అల్లర్లకు వైకాపానే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై పథకం ప్రకారమే దాడి చేశారని పేర్కొన్నారు. బాధితులకు సంబంధించిన కారులో కెమెరా ఉండటం వల్లే దాడి ఘటనలో ఆధారాలు లభించాయని తెలిపారు. ఏపీలలో ఇప్పటికీ వైకాపాకు పోలీసులు అనుకులంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లపై వేసిన సిట్ దర్యాప్తు కాలక్షేపానికి చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నాయకులను తప్పించి అమాయకులను అరెస్టు చెస్తున్నారని విమర్శించారు.

Tags :

మరిన్ని