Cyclone Remal: ‘రేమాల్‌’ తుపాను ప్రభావం ఏపీపై ఉండదు: వాతావరణశాఖ

‘రేమాల్’ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ సునంద తెలిపారు.

Published : 24 May 2024 16:18 IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ సునంద వివరించారు. ఒడిశా, బంగాల్‌, బంగ్లాదేశ్‌పై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. 

Tags :

మరిన్ని