Bangalore Rave Party: బెట్టింగ్‌ పునాదులపై రేవ్‌ పార్టీ నిందితుడి చీకటి సామ్రాజ్యం..!

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు లంకపల్లి వాసు చీకటి సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది.

Published : 23 May 2024 10:26 IST

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి.. అమాంతం రూ.కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్‌ పందేలు, డ్రగ్స్‌ సరఫరాదారులతో సంబంధాలు ఏర్పరచుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పాపం పండినట్లు బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో చిక్కాడు. ఇంకేముంది అతడి చీకటి సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు వాసు మూలాలు విజయవాడలో బయటపడ్డాయి.  

Tags :

మరిన్ని