Kadapa: మూడేళ్లు గడిచినా పూర్తికాని బుగ్గవంక రక్షణగోడ నిర్మాణం

వర్షాకాలం వస్తుందంటేనే కడప నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుగ్గవంక ముంపు నుంచి స్థానికులను కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణం మూడేళ్లుగా పూర్తికాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 23 May 2024 13:25 IST

కడప బుగ్గవంక పేరు వినగానే 2001లో నగరాన్ని ముంచెత్తిన వరుదలే గుర్తుకొస్తాయి. అందరు నిద్రిస్తున్న సమయంలో వచ్చిన వరద.. పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. 2019 నవంబర్‌లోను బుగ్గవంకకు వరద పోటేత్తింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం వర్షాకాలం వస్తుందంటేనే కడప నగర వాసుల గుండెల్లో  రైళ్లు పరిగెడుతున్నాయి. బుగ్గవంక ముంపు నుంచి స్థానికులను కాపాడేందుకు రక్షణ గోడల నిర్మాణం మూడేళ్లుగా పూర్తికాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు