AP News: నత్తనడకన సాగుతున్న నారాయణపురం ప్రాజెక్టు పనులు

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉమ్మడి ప్రాజెక్ట్.. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి.

Published : 30 May 2024 10:43 IST

అధికారుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. గతంలోనే ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి. అధికారులు, నేతలకు అనేక సార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సకాలంలో పొలాలకు నీరందక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఉమ్మడి ప్రాజెక్ట్.. నారాయణపురం ఆనకట్ట రైతులు లబోదిబోమంటున్నారు.  

Tags :

మరిన్ని