Bhadrachalam: భక్తులతో కిక్కిరిసిన భద్రాద్రి ఆలయం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Published : 26 May 2024 11:54 IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు పూజలు ఆపివేశారు. భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయం వద్ద బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కల్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు