Love Me: తిరుమల శ్రీవారి సేవలో దిల్‌ రాజు కుమార్తె, ‘లవ్ మీ’ హీరో

తిరుమల శ్రీవారిని నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి, ‘లవ్ మీ’ చిత్ర నటుడు ఆశిష్ రెడ్డిలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Published : 28 May 2024 15:50 IST

తిరుమల శ్రీవారిని నిర్మాత దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి, ‘లవ్ మీ’ చిత్ర నటుడు ఆశిష్ రెడ్డిలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ‘లవ్ మీ’ చిత్రం విజయవంతం కావాలని ప్రార్థించారు. త్వరలో రాంచరణ్ కథానాయకుడిగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హర్షిత రెడ్డి తెలిపారు.

Tags :

మరిన్ని