రోడ్డుపైనే సీపీఆర్‌.. బాలుడి ప్రాణం కాపాడిన డాక్టర్‌

చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు.

Updated : 17 May 2024 12:53 IST

చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది.. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని.. బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని... చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సీపీఆర్‌ అందించారు. వృత్తి ధర్మం పరిఢవిల్లి... వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు.

Tags :

మరిన్ని