పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఈసీ కీలక ఆదేశాలు

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

Updated : 19 May 2024 20:20 IST

ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు బంకుల్లో పెట్రోల్‌ను లూజుగా విక్రయించకూడదని అధికారులు నోటీసులు అతికించారు. పెట్రోలు, డీజల్ విడిగా ఇవ్వబోమని చెప్పడంతో బంకుల వద్ద కొందరు దుర్భాషలాడుతూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు