Andhra Pradesh poll violence: పల్నాడు హింసలో చేయని తప్పునకు ఎస్పీ బిందుమాధవ్‌ బలి

ఎవరో జ్వాలను రగిలిస్తే వేరెవరో దానికి బలైనట్లుంది సస్పెన్షన్‌కు గురైన పల్నాడు, అనంతపురం ఎస్పీల పరిస్థితి. ఎన్నికల హింసను అరికట్టేందుకు శత విధాలా వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వైకాపా నాయకులతో అంటకాగిన కిందిస్థాయి సిబ్బంది నేరాలకు ఎస్పీలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

Published : 18 May 2024 09:39 IST

పల్నాడులో పోలింగ్‌ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. అయితే, ఆయన సస్పెన్షన్‌కు గురవడానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి, కిందిస్థాయి అధికారుల వరకు అందరూ సహాయనిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం.

Tags :

మరిన్ని