AP News: సీఎస్‌ సూచించిన వారికి పోస్టింగ్‌లు, సస్పెన్షన్లు.. ఏపీలో ఈసీ వింత వైఖరి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసీచూడనట్టే ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటూ.. ఆయన సూచించినవారికే పోస్టింగులు ఇస్తోంది.

Published : 19 May 2024 09:33 IST

  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం నియంత్రణలోకి వెళుతుంది. సీఎస్ సహా ఏ ప్రభుత్వ అధికారైనా కట్టుతప్పితే ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి వివాదాస్పద నిర్ణయాలపై ఈసీ చూసీచూడనట్టే ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్నుంచే కీలక నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సూచించినవారికే పోస్టింగులు ఇస్తోంది. ఈసీ పరిధిలో సీఎస్ పని చేస్తున్నారా? సీఎస్‌ నియంత్రణలో ఈసీ పని చేస్తోందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Tags :

మరిన్ని