Bapatla: బాపట్ల జిల్లా నల్లమడ వాగులో నలుగురు గల్లంతు

బాపట్ల శివారులోని నల్లమడ వాగులో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 

Published : 29 May 2024 20:22 IST

బాపట్ల శివారులోని నల్లమడ వాగులో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పొన్నూరు మండలం మునిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి 12మంది కలిసి వాహనంలో బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు. మార్గమధ్యలో నల్లమడ కాలువ వద్ద ఆగారు. వాగులో స్నానానికి దిగి సునీల్, సన్నీ మునిగారు. వారు కేకలు వేయగా మరో నలుగురు కాపాడేందుకు కాలువలోకి దిగారు. వీరిలో ఇద్దరు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా నలుగురు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. సునీల్‌తో పాటు ఆయన కుమారుడు సన్నీ మృతదేహాలు బయటకు తీశారు.

Tags :

మరిన్ని