గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌కు ఏఐ అనుసంధానం.. చిత్రాలపై కచ్చితమైన సమాచారం ఇవ్వనున్న కొత్త ఫీచర్‌

వినియోగదారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌కు కృత్రిమ మేధను అనుసంధానం చేస్తున్నట్లు టెక్‌ దిగ్గజం ప్రకటించింది.

Updated : 18 May 2024 13:55 IST

వినియోగదారులకు మరింత వేగంగా సేవలు అందించేందుకు గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌కు కృత్రిమ మేధను అనుసంధానం చేస్తున్నట్లు టెక్‌ దిగ్గజం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సెర్చ్‌ చేసే విధానాలు మారనున్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడనున్నట్లు పేర్కొంది. వినియోగదారుడు సుదీర్ఘ, సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి, చిత్రాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం పొందడానికి కొత్త ఫీచర్‌ తోడ్పడుతుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని