Gopichand Thotakura: రోదసి యాత్ర, పర్వతారోహణ.. తెలుగుతేజం గోపీచంద్‌ సాధించిన ఘనతలెన్నో!

తోటకూర గోపీచంద్.. రోదసియాత్ర చేసిన తొలి తెలుగు తేజం ఈ కుర్రాడు. గతంలో పర్వతారోహకుడిగా దక్షిణాఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించారు.

Published : 21 May 2024 12:02 IST

భారతదేశ తొలి స్పేస్‌ టూరిస్టు గోపీచంద్‌ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటకముందే భారతీయ విమానాలు, విదేశీ జెట్‌లు, వైద్య విమానాలను వేల గంటలు నడిపిన ఘనతను ఆయన సాధించారు. విమానాలే కాకుండా సీప్లేన్, హాట్‌ఎయిర్‌ బెలూన్‌ పైలట్‌గా గోపీచంద్‌కు గుర్తింపు ఉంది. పర్వతారోహకుడిగా దక్షిణాఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించారు.

Tags :

మరిన్ని