Heavy Rain: కాకినాడలో కుండపోత.. రహదారులు జలమయం

కాకినాడ జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Published : 24 May 2024 20:19 IST

కాకినాడ జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటన్నరపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణాన్ని వర్షం నీరు ముంచెత్తింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. సాంబమూర్తి నగర్ దుమ్ములపేట డైరీ ఫార్మ్ సెంటర్లలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన అమ్ముకునే పండ్లు, ఇతర వస్తువులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. భాస్కర్ నగర్, గోదారిగుంట, సురేష్ నగర్, పోస్టల్ కాలనీ, వెంకట్‌నగర్ తదితర కాలనీలను వాన నీరు చుట్టుముట్టింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు