Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. పలు చోట్ల రోడ్లు జలమయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్ కేసర్, కోఠి, నాచారం, ఎల్బీ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు.

Published : 11 Jun 2024 21:17 IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్ కేసర్, కోఠి, నాచారం, ఎల్బీ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తడిసి ముద్దయ్యారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. వాన దంచికొట్టడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని