Hyderabad: హైదరాబాద్‌లో వర్షం.. మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం!

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులపై వరద నీరు చేరింది. మాదాపూర్‌లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Updated : 05 Jun 2024 20:00 IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులపై వరద నీరు చేరింది. మాదాపూర్‌లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. మాదాపూర్‌ నుంచి కేపీహెచ్‌బీ, జుబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ మార్గాల్లో ట్రాఫిక్ జాం తలెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్‌ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలోనూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. 

Tags :

మరిన్ని