శ్రీశైలంలో భక్తుల రద్దీ.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

శ్రీశైలం మహా క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు.

Updated : 19 May 2024 20:19 IST

శ్రీశైలం మహా క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. విరామ సమయంలో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీశైలంలోని టోల్‌ గేట్ మలుపు వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దేవస్థానం సెక్యూరిటీ హోంగార్డులు ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకపోవడంతో భక్తులే సమన్వయంతో స్వయంగా తమ వాహనాలను ముందుకు కదిలించారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంతో పాటు, సమస్యలు తలెత్తకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు