Pinnelli: పిన్నెల్లికి కాస్త ఊరట... జూన్ 13 వరకు అరెస్ట్ వాయిదా

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించింది.

Published : 07 Jun 2024 09:38 IST

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించింది. గురువారం బెయిల్  పిటిషన్‌పై వేసవి సెలవుల బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. రాత్రి 10 కావడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరువైపు న్యాయవాదుల సమ్మతి మేరకు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ వాయిదా వేశారు. 

Tags :

మరిన్ని