Pawan Kalyan: తగ్గి నెగ్గిన పవన్‌కల్యాణ్‌..!

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అని సినిమాలో చెప్పిన ఈ డైలాగ్‌నే రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan).

Published : 05 Jun 2024 10:03 IST

అటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీపరంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైన దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). వైకాపా అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కనపెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైకాపా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా... పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లూ త్యజించారు. హలో ఏపీ.. బైబై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

Tags :

మరిన్ని