Viral Video: గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తే.. కాలవలోకి వెళ్లిన కారు!

భారీ వర్షాల్లో గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ పర్యటక బృందం కారు.. కాలువలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యటకులు కారులో కేరళలోని అలప్పుళకు బయలుదేరారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న రహదారిపై వరద నీరు భారీగా నిలిచిపోయింది.

Published : 26 May 2024 15:06 IST

భారీ వర్షాల్లో గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ పర్యటక బృందం కారు.. కాలువలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యటకులు కారులో కేరళలోని అలప్పుళకు బయలుదేరారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వారు ప్రయాణిస్తున్న రహదారిపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. ఆ ప్రాంతం గురించి వారికి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. మ్యాప్ చూపించిన మార్గంలో పర్యటకులు ప్రయాణించగా.. కారు నేరుగా నీటితో నిండిన కాలువలోకి వెళ్లింది. స్థానికులు, పోలీసుల సాయంతో వారందరూ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. నీటిలో పూర్తిగా మునిగిన వాహనాన్ని క్రేన్ సాయంతో బయటకి తీసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు